News February 3, 2025
KMR: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సిబ్బందికి సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని గదులను అదనపు కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. ఎన్నికల నియమావళి మేరకు గదులను ఏర్పాటు చేయాలని, CC కెమెరాలు, బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News January 21, 2026
KNR: ‘జాతీయ ఓటరు దినోత్సవం విజయవంతం చేయాలి’

ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బూత్ స్థాయి పోలింగ్ అధికారులు వృద్ధ ఓటర్లకు సన్మానం చేయాలని పేర్కొన్నారు.
News January 21, 2026
అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని HYD CP, సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ‘ఈ కేసులో హరీశ్‌ను ఇవాళ విచారించాం. ఆయనకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా బయల్దేరి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చాం. కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించాం’ అని చెప్పారు. ఇవాళ 7గంటలకు పైగా హరీశ్ రావును సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
News January 21, 2026
జనవరి 23న కరీంనగర్‌లో ఇన్నోవేషన్ పంచాయత్ నిర్వహణ

కరీంనగర్ ఐటీ టవర్‌లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమం నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC) ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలు, ఆవిష్కరణలపై నేరుగా సలహాలు, మార్గదర్శకత్వం పొందగలుగుతారు. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల ఆవిష్కర్తలు పాల్గొనవచ్చు.


