News January 17, 2025
KMR: ఎన్నికల సామాగ్రికి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు అవసరమైన సామగ్రి సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ శుక్రవారం తెలిపారు. టెండర్ దరఖాస్తు ఫాంలు ఈ నెల 18 నుంచి 24 వరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా పంచాయతీ అధికారి నంబర్ 7306245710కు సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 21, 2025
MHBD: సర్పంచ్ ప్రమాణ స్వీకార పత్రం.. ఇలా చేయాలి!

22న జరిగే సర్పంచుల ప్రమాణ స్వీకార పత్రం ఈ విధంగా ఉంది. గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికైన నేను.. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం, ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018, దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం, నా విధులు, బాధ్యతలను భయమో, పక్షపాతమో లేకుండా, నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
News December 21, 2025
హనుమకొండ: ఓటు వేయలేదని తల్లిదండ్రులపై దాడి

తనకు ఓటు వేయలేదని తల్లిదండ్రులపై దాడి చేసిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో చోటుచేసుకుంది. ఇటీవల వంగర సర్పంచ్‌గా గజ్జెల సృజన-రమేష్ గెలుపొందారు. తమకు ఓటు వేయలేదని రమేష్ తన తల్లిదండ్రులైన రాజయ్య, ఎల్లమ్మలపై దాడి చేశారు. రాజయ్య ప్రస్తుతం ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు వంగర పోలీస్ స్టేషన్లో కొడుకుపై ఫిర్యాదు చేశాడు.
News December 21, 2025
వరంగల్: గాదె ఇన్నయ్య ఆశ్రమంలో NIA తనిఖీలు

జఫర్‌ఘడ్‌లోని గాదె ఇన్నయ్య నడుపుతున్న మా ఇల్లు గాదె ఇన్నయ్య ఆశ్రమంలో NIA పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్ట్‌గేషన్ అధికారులు గాదె ఇన్నయ్యను విచారిస్తున్నారు. ఇటీవల ఇన్నయ్య హిడ్మా కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన్నట్లు సమాచారం రావడంతో ఆయన్ను NIA అధికారులు ప్రశ్నించారు. అలాగే మాజీ నక్సల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.


