News April 2, 2025

KMR: ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు: డీఈఓ రాజు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించినట్టు జిల్లా డీఈఓ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. (సమ్మేటివ్ -2) వార్షిక పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థులకు పరీక్షలకు సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. అనంతరం 12:30కి మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంటుందని తెలిపారు.

Similar News

News November 28, 2025

పెద్దపల్లి: FDHS సిబ్బందికి వీడ్కోలు సన్మానం

image

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో FDHS స్కీమ్‌లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి శుక్రవారం వీడ్కోలు కార్యక్రమం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సదానందం, సాజిద్, శ్రీనివాస్, మీర్జా, వాచ్‌మ్యాన్ రాజయ్యలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు బదిలీ అయ్యారు. తక్కువ వేతనంతో కీలకంగా సేవలందించిన వీరిని డా.వాణిశ్రీ అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 28, 2025

SKLM: ఏడు రోజుల మహోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. శుక్రవారం కలెక్టరేట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు సమీక్ష నిర్వహించారు. దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలన్నారు.

News November 28, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం