News January 30, 2025
KMR: ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు!

KMR జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారం ఎత్తుతున్నారు. అభాగ్యులను లంచాల రూపంలో దోచుకుంటున్నారు. నవంబర్ 14 న స్టేషన్ బెయిల్ కోసం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రైటర్ తోట రామస్వామితో పాటు SI అరుణ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా SI సుధాకర్ పట్టుబడ్డారు. జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు SIలు, ఓ రైటర్ ఏసీబీకి చిక్కారు. వారిద్దరూ ఒకే స్టేషన్కు చెందినవారు కావడం విశేషం.
Similar News
News October 26, 2025
TU: B.Ed, B.P.Ed రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని B.Ed, B.P.Ed 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 2, 3, 4 బ్యాక్ లాగ్(2021 బ్యాచ్) విద్యార్థులు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నవంబర్ 3వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News October 26, 2025
వైద్యురాలు ఆత్మహత్య.. BJPపై రాహుల్ ఫైర్

మహారాష్ట్రలో SI రేప్ చేశాడని వైద్యురాలు <<18091644>>సూసైడ్<<>> చేసుకోవడంపై LoP రాహుల్గాంధీ స్పందించారు. ‘ఎలాంటి సివిలైజ్డ్ సొసైటీనైనా కదిలించే విషాదమిది. అవినీతి వ్యవస్థలో స్థిరపడిన క్రిమినల్స్ చేతిలో ఆమె బలైంది. ప్రజలను రక్షించాల్సినవారే ఘోరానికి పాల్పడ్డారు. దీని వెనుక BJP నేతలు, సంపన్నులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అమానవీయ ముఖాన్ని ఇది బయటపెట్టింది. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.
News October 26, 2025
వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


