News January 30, 2025
KMR: ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు!

KMR జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారం ఎత్తుతున్నారు. అభాగ్యులను లంచాల రూపంలో దోచుకుంటున్నారు. నవంబర్ 14 న స్టేషన్ బెయిల్ కోసం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రైటర్ తోట రామస్వామితో పాటు SI అరుణ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా SI సుధాకర్ పట్టుబడ్డారు. జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు SIలు, ఓ రైటర్ ఏసీబీకి చిక్కారు. వారిద్దరూ ఒకే స్టేషన్‌కు చెందినవారు కావడం విశేషం.
Similar News
News February 16, 2025
సంగారెడ్డి: రేపు విధులలో చేరాలి: డీఈవో

డీఎస్సీ 2008 ద్వారా ఎంపికై నియామక పత్రాలు అందుకున్న నూతన ఉపాధ్యాయులందరు రేపు పాఠశాలలో విధులలో చేరాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఫిట్నెస్ సర్టిఫికెట్, అగ్రిమెంట్ కాపీలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రేపు సాయంత్రంలోగా పంపాలని సూచించారు.
News February 16, 2025
ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా?

ప్రస్తుతం ఆన్‌లైన్, పార్సిల్‌లో వచ్చే ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో వస్తోంది. కానీ వీటిలో ఉంచిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో వేడి వేడి ఆహారం ఉంచడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. అవి మన శరీరంలోకి చేరి గట్ లైనింగ్‌ను నాశనం చేసి డీహైడ్రేటింగ్‌కు దారితీస్తాయి. పేగులను అనారోగ్యానికి గురి చేస్తాయి. గుండె జబ్బులు రావచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లో ఫుడ్ తినడం బెటర్.
News February 16, 2025
ఘజన్‌ఫర్ స్థానంలో ముంబైలోకి ముజీబ్

IPL: అఫ్గానిస్థాన్ ప్లేయర్ అల్లా ఘజన్‌ఫర్ స్థానంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు ఘజన్‌ఫర్ దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో రూ.4.8 కోట్లు వెచ్చించి ముంబై ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి MI స్పిన్నర్లు శాంట్నర్, ముజీబ్ ఎలా రాణిస్తారో చూడాలి.