News March 6, 2025

KMR: ఒకే రోజు నలుగురు మృతి.. జర జాగ్రత్త..!

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం ఒక్క రోజు వివిధ గ్రామాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో అంజవ్వ, డొంకేశ్వర్ మండలం అన్నారంలో చిన్నారెడ్డి, ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లో శ్రీనివాస్, రామారెడ్డిలో మానస మరణించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News December 5, 2025

వలస కూలీల పిల్లలను బడిలో చేర్చాలి: KNR కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో వలస కూలీలు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను గుర్తించి ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాధికారులను ఆదేశించారు. పిల్లలకు రవాణా సాయం అందించాలని ఇటుక బట్టీల యజమానులను కోరారు. అలాగే, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ క్లాస్‌లు పర్యవేక్షించి నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.

News December 5, 2025

అద్దెకు పురుషులు.. ఎక్కడో తెలుసా?

image

లాత్వియా దేశంలో పురుషుల కొరత కారణంగా మహిళలు “అద్దె” సేవలను వినియోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్కడ పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్లంబింగ్‌, కార్పెంటరీ, రిపేర్లు, పెయింట్లు వేయడంతో పాటు ఇతర పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అదే విధంగా చాలా మంది పార్ట్‌నర్‌ కోసం ఇతర దేశాలకు సైతం వెళ్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కూడా ఇలాంటి సేవలు ఉన్నాయి.

News December 5, 2025

ఒంటరితనంతో మహిళల్లో తగ్గుతున్న ఆయుష్షు

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో ఒంటరితనం పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా లోన్లీనెస్‌తో బాధపడుతున్న వారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మహిళల DNA రక్షణ కవచంలోని కణాలు కుంచించుకుపోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, ఇమ్యునిటీ తగ్గడం దీనికి కారణమని చెబుతున్నారు.