News February 17, 2026

KMR: కలిసొచ్చిన మూడు ఓట్లు.. చైర్ పర్సన్‌కు మలుపు

image

కామారెడ్డి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నిక మూడు రోజులపాటు మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించి కంటిమీద కునుకు లేకుండా చేసింది. చివరకు మూడు ఓట్ల తేడాతో 38వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైనే విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్ రెబల్) మళ్లీ కాంగ్రెస్‌లో చేరి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె BRS మద్దతుతో పుర పీఠం ఎక్కడం గమనార్హం.

Similar News

News March 17, 2026

జగిత్యాల: పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి నిర్ణయం.. సంజయ్ కామెంట్స్

image

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ మీడియా చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీని వీడాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎల్.రమణతో కలిసి పనిచేశానని, అలాగే జీవన్ రెడ్డితో కూడా కలిసి పని చేస్తానని తెలిపారు. ఎల్.రమణలాంటి నాయకులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని, అలాంటి నిర్ణయాల్లో జరిగిన తప్పిదాల వల్లనే BRS మళ్లీ అధికారంలోకి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.

News March 17, 2026

కరీంనగర్: కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

కరీంనగర్(D) కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి రాచకొండ లచ్చయ్య (55) మృతదేహం లభ్యమైంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన, ఆదివారం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. ఒడ్డున దుస్తులు, బైక్ గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టగా చింతకుంట శివారులో మృతదేహం దొరికింది. భార్య పద్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 17, 2026

కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మదనపూర్ 38.2, వెలుగొండ 37.4, వీపనగండ్ల 37.2, పెద్దమందడి, దగడ 36.9, ఆత్మకూరు, వనపర్తి 36.3, అమరచింత, జానంపేట 35.8, శ్రీరంగాపూర్ 35.5, పానగల్, రేమద్దుల, పెబ్బేరు, ఘన్‌పూర్ 35.3, విలియంకొండ 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.