News April 2, 2025

KMR: కలెక్టరేట్లో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమాజ స్థాపన చేసిన మహనీయుడని కొనియాడారు. బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

image

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.

News November 17, 2025

పైరసీ సైట్లను ఎంకరేజ్ చేయవద్దు: సజ్జనార్

image

TG: ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశాడని HYD CP సజ్జనార్ తెలిపారు. ‘రవిని పోలీస్ కస్టడీకి కోరాం. విచారణలో పూర్తి వివరాలు రాబడతాం. పైరసీ చేసినా, చూసినా నేరమే. యూజర్ల డివైజ్‌లలోకి మాల్వేర్ పంపి వ్యక్తిగత డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయవద్దు’ అని సూచించారు.

News November 17, 2025

బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.