News February 13, 2025

KMR: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ ఔట్

image

నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రామలింగంను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఓబీసీ విభాగం ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News October 20, 2025

రాజంపేట: రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్‌కు అక్కాతమ్ముడు ఎంపిక

image

రాజంపేటలోని ఓ పాఠశాలలో చదువుతున్న అక్కా, తమ్ముడు రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కడప మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో 1వ తరగతి చదువుతున్న సగిలి రావణ రింగ్ రేస్-1, 2లో రెండు గోల్డ్ మెడల్ సాధించాడు. అక్క సంఘమిత్ర రింగ్ రేస్-1లో రజత పతకం సాధించింది. కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారని టీచర్లు తెలిపారు.

News October 20, 2025

ఉరవకొండలో ఆ రోజు.. దేవుడు మాట్లాడారు!

image

పుట్టపర్తి సత్యసాయి బాబా 1940 అక్టోబర్ 20న ఉరవకొండలో తన అవతారాన్ని ప్రకటించారు. అబ్కారీ బంగ్లా సమీపంలోని రాతి గుండుపై కూర్చొని ‘నేను సత్యనారాయణుడు కాదు, సత్యసాయిని’ అని ప్రకటించారు. ఆ ప్రదేశంలో డా.నలబాల ఆంజనేయులు 2003లో భజన మందిరం నిర్మించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న అక్కడ రథోత్సవం జరుగుతుంది. అవతార ప్రకటన తర్వాత సత్యసాయి బాబా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను కొనసాగించారు.

News October 20, 2025

GNT: ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా.?

image

ఆ రోజులలోని దీపావళి ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉండటం లేదు. 7 రోజుల ముందు నుంచే రీల్స్ గన్స్ పేల్చుకుంటూ జేమ్స్ బాండ్లా ఫీల్ అయ్యేవాళ్లు. పండుగ రోజున నాన్నతో టపాసులు కొనుక్కొని డాబాపై ఎండబెట్టి, నాగుల చవితి కోసం కొన్ని దాచుకోని, సాయంత్రం క్రాకర్స్ కాల్చుకునేవాళ్లు. రాత్రికి ఇంటిబయట కాగితాలు బట్టి.. ఎవరు ఎక్కువ కాల్చారో ఫ్రెండ్స్‌తో డిస్కషన్‌తో పండుగ ముగిసేది. ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే COMMENT చేయండి.