News March 27, 2025
KMR: కానిస్టేబుల్, హోంగార్డు సస్పెన్షన్

విధుల నిర్వహణలో ఓ వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు KMR జిల్లా SP రాజేశ్ చంద్ర తెలిపారు. ఓల్డ్ బాన్సువాడలోని కల్లు దుకాణంలో గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కల్లు తాగి న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారం మేరకు వీరిద్దరూ అక్కడికి వెళ్లి సదరు వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించారన్నారు. ఈ మేరకు వారిని తాత్కలికంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
Similar News
News October 29, 2025
కాగజ్‌నగర్: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ప్రజలను మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ మంగళవారం తెలిపారు. నిందితుడు స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి 108 మందిని అందులో చేర్చి పెట్టుబడుదారులను మోసం చేసినట్లు తెలిపారు. అందులో 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.76,50,000 ఇన్వెస్ట్ చేశాడని పేర్కొన్నారు.
News October 29, 2025
అనకాపల్లి: ‘నష్టం వివరాలను సేకరించాలి’

జిల్లాలో జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను సేకరించి వెంటనే నివేదికలను అందించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మంగళవారం రాత్రి మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటిందన్నారు. రానున్న రెండు రోజుల పాటు ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. రహదారులు మరమ్మతులకు గురైతే వెంటనే రిపేర్లు చేపట్టాలన్నారు.
News October 29, 2025
పార్వతీపురం జిల్లాలో నలుగురు సచివాలయ ఉద్యోగులు సస్పెండ్

సీతానగరం మండలం పెదబోగిలి సచివాలయంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సైక్లోన్ డ్యూటీలో విధులు సక్రమంగా నిర్వహించకుండా కార్యాలయాన్ని విడిచిపెట్టి ఇళ్లకు వెళ్లిపోయారన్నారు.ఈ మేరకు బి.భాస్కరరావు DA, జి.సుమతి WEA, జి.జానకి AHA, ఆర్.అప్పలనరసమ్మ MSPలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


