News April 2, 2025

KMR: కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం

image

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల సమావేశం మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. కిసాన్ న్యాయ యోధ మెంబర్షిప్‌ లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన జాతీయ నేషనల్ కిసాన్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నీలం రమేశ్ ఉన్నారు.

Similar News

News February 23, 2026

బాపట్ల: 82 కేంద్రాల్లో ‘పది’ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లాలో మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 15,944 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో బాలురు 7,977 మంది, బాలికలు 7,967 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News February 23, 2026

ఇండియా బ్లాక్ చీఫ్ మమతా బెనర్జీ: మణిశంకర్ అయ్యర్

image

మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా’ బ్లాక్ డ్రైవింగ్ సీటు నుంచి తప్పుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు. ప్రాంతీయ పార్టీల నేతలకు అవకాశం ఇవ్వాలని హితవు పలికారు. మమతా బెనర్జీని కూటమికి అసలైన నాయకురాలిగా పేర్కొన్నారు. ఆమె లేకపోతే కూటమి మనుగడే ఉండదని అభిప్రాయపడ్డారు. స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి నేతలు కూటమిని నడిపించగలరని వ్యాఖ్యానించారు.

News February 23, 2026

కృష్ణా: డిగ్రీలతో ఉద్యోగాలు రావు- వెంకయ్య నాయుడు

image

ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావన్నారు. నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.