News March 10, 2025
KMR: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

కూతురును పుట్టిందన్న సంతోషంలో కామారెడ్డి జిల్లాలోని అత్తగారింటికి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం వాసి నరేశ్ (28)కు నెల క్రితం కూతురు పుట్టింది. బీబీపేట మండలం మల్కాపూర్‌లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్‌పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. కేసు నమైదైంది.
Similar News
News February 24, 2026
పెద్దపల్లిలో సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ ముగింపు

పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహించిన రెండో దశ ఐదు రోజుల ఓరియంటేషన్ శిక్షణ విజయవంతంగా ముగిసింది. పలు మండలాల సర్పంచులు పాల్గొన్నారు. ముగింపు సమావేశానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై సర్టిఫికెట్లు అందజేశారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు.
News February 24, 2026
జగిత్యాల: ‘ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి’

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించి కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.
News February 24, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని 28 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉ. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


