News March 19, 2025

KMR: గుడిలో దొంగతనం చేసి చనిపోయాడు

image

ఆలయంలో దొంగతనానికి యత్నించిన వ్యక్తికి గ్రామస్థులు దేహశుద్ధి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తునూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. ఉత్తునూర్‌లో మంగళవారం రాత్రి హనుమాన్ ఆలయంలో శ్రీకాంత్(25) దొంగతనానికి యత్నించాడు. గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. తీవ్ర గాయాలైన శ్రీకాంత్‌ను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Similar News

News September 18, 2025

మంచిర్యాల: ‘నిబంధనలకు ఉల్లంఘిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి’

image

తాండూరు మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సెయింట్ థెరీసా పాఠశాలపై చర్యలు తీసుకోవాలని గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఏడీ లలితకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల బుధవారం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. వెంటనే పాఠశాలను సీజ్ చేసి గుర్తింపు రద్దు చేయాలని కోరారు.

News September 18, 2025

VJA: వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ

image

SRR & CVR కళాశాలలో వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో వెబ్‌సైట్ రూపకల్పనపై శిక్షణ ఇస్తామని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు దీనికి హాజరు కావొచ్చన్నారు. వివరాలకై APSSDC ట్రైనింగ్ కో ఆర్డినేషన్ అధికారి నరేశ్‌ను సంప్రదించాలని కోరారు.

News September 18, 2025

వరంగల్: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

image

నగర వాసులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రత్యేక సూచనలు జారీ చేశారు. వాటిలో రోడ్డు దాటే సమయంలో జిబ్రా క్రాసింగ్ తప్పనిసరిగా ఉపయోగించాలని, వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్‌లు కచ్చితంగా పాటించాలన్నారు. డ్రైవింగ్ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను ఉపయోగించొద్దని హెచ్చరించారు.