News January 23, 2025

KMR: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు టీజీ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ జిల్లా నోడల్ అధికారి జీ. నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ నెల 7 నుంచి ఫిబ్రవరి 1 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News February 26, 2026

జగిత్యాల: గంజాయి కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

జగిత్యాల జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, విక్రయానికి పాల్పడిన మెస్రాం నాగనాథ్‌కు గౌరవ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి ఎస్. నారాయణ 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. రాయికల్‌లో 1.5 కిలోల ఎండు గంజాయితో పట్టుబడిన నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 26, 2026

కడప: ఇవాళ పరీక్షకు 466 మంది గైర్హాజర్.!

image

కడప జిల్లాలో గురువారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ ఇంగ్లిష్ పరీక్షలు జరిగాయి. నేడు 16,861 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 16,395 మంది మాత్రమే రాశారు. 466 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 15,792 మంది రాయాల్సి ఉండగా.. 15,300 మంది రాశారు. 402 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,159 మంది రాయాల్సి ఉండగా.. 1,095 మంది రాశారు. 64 మంది రాయలేదు.

News February 26, 2026

ఏలూరు జిల్లాలో ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకరోజు ముందుగానే, ఈనెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లాలో 2,57,658 మంది లబ్ధిదారులకు రూ.113.09 కోట్లు అందజేస్తున్నామని, శనివారమే వంద శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.