News January 25, 2025
KMR: గ్రామ, వార్డు సభలు పూర్తి..అర్జీలు ఎన్నంటే?

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రజాపాలన’ గ్రామ, వార్డు సభలు శుక్రవారంతో పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామ, వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందజేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా 535 గ్రామ సభలు, 80 వార్డు సభలు నిర్వహించగా.. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News December 2, 2025
అల్లూరి: నేటి నుంచి ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు

మావోయిస్టుల పీఎల్ జీఏ వారోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు విశాఖపట్నం డిపో నుంచి సీలేరు మీదుగా నడిచే ఆర్టీసీ నైట్ సర్వీసు బస్సులను రద్దు చేసినట్టు విశాఖ డిపో డీఎం మాధురి తెలిపారు. విశాఖ-సీలేరు నైట్ హాల్ట్, విశాఖ-భద్రాచలం, అలాగే భద్రాచలం-విశాఖ నైట్ సర్వీసులను రద్దు చేశామని పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
News December 2, 2025
ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.
News December 2, 2025
సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.


