News January 20, 2025
KMR: గ్రామ సభల్లో వైద్య సిబ్బంది పాల్గొనాలి: జిల్లా వైద్యాధికారి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో సంబంధిత గ్రామ, మండల ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొనాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.చంద్రశేఖర్ ఆదేశించారు. ఆశా, ANM, సూపర్వైజరీ, MLHP ప్రతి గ్రామ సభల్లో తప్పకుండా ఉండాలన్నారు. గ్రామ సభల్లో సంబంధిత రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News December 5, 2025
ADB: పల్లె నుంచి పార్లమెంటు వరకు..!

ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో సర్పంచ్ కీలక పదవి. అలా గ్రామంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారు కొందరు మంత్రులయ్యారు. ఆ కోవకు చెందినవారే పొద్దుటూరి నర్సారెడ్డి. సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామ సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం మూడుసార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందులో ఓసారి ఏకగ్రీవ ఎమ్మెల్యేగా కావడం విశేషం. నర్సారెడ్డిని స్థానికులు నరసన్న బాపు అని ప్రేమగా పిలిచేవారు.
News December 5, 2025
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్లను సంప్రదించాలి.
News December 5, 2025
GNT: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆదేశాలు

సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల నియంత్రణ ఇతర ప్రాధాన్య ఆరోగ్య అంశాలపై గురువారం సచివాలయం నుంచి విజయానంద్ అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ వీసీలో పాల్గొన్నారు.


