News October 10, 2024

KMR: చిన్నపుడే అమ్మానాన్న మృతి.. వ్యవసాయం చేస్తూనే SA జాబ్

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన శేఖ్ గౌస్ ఓ వైపు వ్యవసాయం చేస్తూనే బయోసైన్స్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయినా అధైర్యపడలేదు. వ్యవసాయం చేస్తూనే ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని చూసుకున్నాడు. చివరికి ప్రభుత్వ కొలువు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దీంతో మద్నూర్ గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News December 21, 2025

బోధన్: పెట్టుబడి పేరుతో సైబర్ మోసం

image

బోధన్ మండలం ఊట్‌పల్లిలోని ఓ మహిళ సైబర్ క్రైంలో రూ.3 లక్షలు పోగొట్టుకుంది. టెలిగ్రామ్‌లో పరిచయం అయిన వ్యక్తి తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెండింతలు డబ్బులు ఇస్తామని ఆశ చూపాడు. అత్యాశకు పోయి మహిళ ఫోన్ పే ద్వారా విడతల వారీగా రూ.3 లక్షల డబ్బులు పంపిననట్లు తెలిపింది. తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News December 20, 2025

బోధన్: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు

image

బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవపడిన ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.

News December 20, 2025

NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.