News October 10, 2024
KMR: చిన్నపుడే అమ్మానాన్న మృతి.. వ్యవసాయం చేస్తూనే SA జాబ్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన శేఖ్ గౌస్ ఓ వైపు వ్యవసాయం చేస్తూనే బయోసైన్స్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయినా అధైర్యపడలేదు. వ్యవసాయం చేస్తూనే ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని చూసుకున్నాడు. చివరికి ప్రభుత్వ కొలువు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దీంతో మద్నూర్ గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News July 11, 2025
వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
News July 11, 2025
NZB: ముందుందిలే మనకు మంచికాలం..!

శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మెుదలైంది. కొన్నిరోజులుగా కృష్ణానది పరుగులిడుస్తుంటే..గోదారమ్మ వెలవెలబొయింది. కాగా గత మూడు రోజులుగా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామసాగర్‌కు ప్రాజెక్టు వరదనీరు వచ్చిచేరుతోంది. గతేడాది ఇదే సమయానికి 12.440 టీఎంసీల నీరు ఉండగా ఈ ఏడాది 20.138 టీఎంసీల నీరు ఉంది. 4309 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
News July 11, 2025
NZB: తెలంగాణ ఇంజినీర్స్ డే.. మన ప్రాజెక్టులకు రూపశిల్పి ఆయనే

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జాతీయ ఇంజినీర్స్ డే జరుపుకుంటాం. అలాగే తెలంగాణలో అంతటి మేధావి, సమకాలికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని ప్రభుత్వం జూలై11ను ‘తెలంగాణ ఇంజనీర్స్‌డే’ గా నిర్వహిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు, పొచారం ప్రాజెక్టు, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం బోధన్ నిజాంషుగర్స్ ఈయనే నిర్మించారు. కాగా అలీసాగర్ జలాశయానికి ఈయన పేరునే పెట్టారు.