News July 6, 2024

KMR: చిన్నారి విక్రయం.. ఇద్దరు డాక్టర్లతో సహా పలువురి అరెస్ట్

image

ఓ చిన్నారిని విక్రయించిన కేసులో ఇద్దరు డాక్టర్లతో పాటు పలువురిని శనివారం అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తండ్రి కొడుకులైన ఇట్టం సిద్దిరాములు, ఇట్టం ప్రవీణ్ కుమార్‌తో పాటు ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆస్పత్రి వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, భూపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News December 10, 2025

NZB: మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ హాల్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు.

News December 10, 2025

NZB: ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు: కలెక్టర్

image

ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేప్పుడు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఓటర్, ఆధార్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ పాస్ బుక్‌లు తీసుకెళ్లాలన్నారు.

News December 10, 2025

నిజామాబాద్: ఈనెల 14న ఉద్యోగ మేళా

image

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఈనెల 14న HCL టెక్ బీ ఉద్యోగ మేళా నిర్వహిస్తోందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ తెలిపారు. 2024-25లో ఇంటర్‌లో 75 శాతం మార్కులు, మ్యాథ్స్ 60శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, నగరంలోని వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్‌లో నిర్వహించనున్న జాబ్ మేళాకు విద్యార్థులు హాజరుకావాలని, పూర్తి వివరాల కోసం 80740 65803ను సంప్రదించాలని సూచించారు.