News March 20, 2025
KMR: చెక్పాయింట్లు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాకు జాయింట్ సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, మైనింగ్, భూగర్భ జలశాఖ, నీటిపారుదల శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. మంజీరా నదిపై జరిగే అక్రమ ఇసుక రవాణా అరికట్టడం కోసం చెక్ పాయింట్ల ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
Similar News
News November 20, 2025
అనంతపురంలో కిలో టమాటా రూ.47

టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.30-40 వరకు పలుకుతున్న టమాటా ధర బుధవారం ఏకంగా రూ.47 పలికింది. దీంతో అనంతపురం జిల్లా రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కక్కలపల్లి మార్కెట్కు 2,145 టన్నులు వచ్చినట్లు ఇన్ఛార్జి రూప్ కుమార్ తెలిపారు. చలితీవ్రత కారణంగా దిగుమతి తగ్గడంతో క్యాప్సికమ్, దొండకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, క్యారట్ తదితర కూరగాయల రేట్లు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
News November 20, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.
News November 20, 2025
తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.


