News February 9, 2025
KMR: జాతీయ సేవా పురస్కారం అందుకున్న జమీల్

ఓ వైపు విద్యా బుద్ధులు నేర్పుతూనే మరో వైపు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వ టీచర్, కామారెడ్డి రక్త దాతల సమూహం అధ్యక్షుడు జమీల్ జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. జయజయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Similar News
News March 25, 2025
బెట్టింగ్ యాప్ కేసులో కొత్త మలుపు

నిషేధిత బెట్టింగ్ యాప్స్ <<15822419>>కేసులో<<>> కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులని కూడా నిందితులుగా చేర్చారు. సెలబ్రిటీలను విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకోనున్నారు. తొలుత యాప్ నిర్వాహకులను విచారించనున్నారు. తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని ముందుగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం యాప్‌ల నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News March 25, 2025
ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు

జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్‌కువచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.
News March 25, 2025
జీవీఎంసీలో ఏ కార్పొరేటర్‌పైనా ఒత్తిడి తేలేదు: MLC పిడుగు

జీవీఎంసీ మేయర్ పీఠం కోసం ఏకార్పొరేటర్ పైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని జనసేన MLC పిడుగు హరిప్రసాద్ అన్నారు. సోమవారం గాజువాకలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని కార్పొరేటర్లు గ్రహించారని దీంతో వారంతా మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అధికార బలంతో గతంలో జీవీఎంసీలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన.. వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు.