News November 24, 2024
KMR జిల్లాలో సంక్షేమానికి చేసిన ఖర్చు వివరాలు
జిల్లాలో 23 శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. PM కిసాన్ సమ్మాన్ నిధికి రూ.531.6 కోట్లు, మధ్యాహ్న భోజనం రూ.9.68 కోట్లు, ఉపాధి హామీ పథకం రూ.73 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.36.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.61.25 కోట్లు, RRRకు రూ.16.63 కోట్లు, MP లాడ్స్‌కు రూ.59.37 లక్షలు, PM ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి రూ.49.50 లక్షలు ఖర్చు చేశామన్నారు.
Similar News
News December 9, 2024
NZB: కాంగ్రెస్ పెద్దలను కలిసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్
యువజన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన విపుల్ గౌడ్ ఆదివారం ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి వారిని సన్మానించారు. ఎన్నికల్లో గెలిచిన విపుల్ గౌడ్‌ను వారు అభినందించారు.
News December 8, 2024
NZB: గొంతు కోసి హత్య చేసిన దుండగులు
ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక మిర్చి కాంపౌండ్‌లోని ఓ ట్రాన్స్ పోర్ట్ షాపు వద్ద నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఆదివారం ఉదయం షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో 1 టౌన్ సీఐ రఘుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
News December 8, 2024
NZB: ముగ్గురు బిడ్డలను అమ్మేసిన కసాయి తల్లి
కన్నతల్లే ముగ్గురు బిడ్డలను అమ్మేసిన ఘటన ఆర్మూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. SHO సత్యనారాయణ వివరాలు.. మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్యి భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఇంకో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్నది. కాగా మొదటి భర్తకు పుట్టిన ఏడేళ్ల బాబు, ఇద్దరు మగ కవల పిల్లలను రూ.4లక్షలకు ముగ్గురు వ్యక్తులకు విక్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెతో పాటు పిల్లలను కొన్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.