News March 14, 2025

KMR: జిల్లా కోర్టు సంచలన తీర్పు

image

హత్య కేసులో KMR జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. జిల్లా SP రాజేష్ చంద్ర వివరాలిలా.. మాల్తుమ్మెద వాసి రామ కృష్ణయ్యకు, కర్రె రాజయ్యతో తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా..రాజయ్య, రామ కృష్ణయ్య తలపై కర్రతో కొట్టి చంపాడు. నాగిరెడ్డి పేట్ PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా జడ్జి వరప్రసాద్ రాజయ్యకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Similar News

News April 11, 2026

ప.గో: పెళ్లింట తీవ్ర విషాదం

image

పెదవేగిలోని వలసపల్లి సమీపంలో <<19612501>>గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి(M)ముక్కంపాడుకు<<>> చెందిన సచివాలయ ఉద్యోగి సుధీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇతని భార్య గర్భిణీ. అంతేకాకుండా మరోవైపు మృతుని సోదరునికి ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడంతో పెళ్లింట శోక సంద్రంలో మునిగిపోయారు.

News April 11, 2026

ఎల్లారెడ్డిపేట: సెక్యూరిటీ లేకే.. ఏటీఎం ఎత్తుకెళ్లారు!

image

ఎల్లారెడ్డిపేటలో ఎస్బీఐ ఏటీఎం మిషన్‌ చోరీకి భద్రతా లోపమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మండలంలోని ఐదు ఏటీఎంలలో కేవలం ఒక సిరిసిల్ల బ్యాంకుకు మాత్రమే సెక్యూరిటీ గార్డు ఉండటం గమనార్హం. జిల్లాలోనే ఇది మొట్టమొదటి వింత చోరీ కావడంతో ఎస్పీ తీవ్రంగా పరిగణించి, నిందితుల వేట కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భద్రతా నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 11, 2026

KMR: రేపు జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు

image

కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం 10 గంటలకు డీఎస్ఏ రెజ్లింగ్ హాల్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ ఛైర్మన్ వినోద్ తెలిపారు. ఈ పోటీలకు 2009–2011 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని, పాల్గొనేవారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.