News February 3, 2025
KMR: జిల్లా వాసికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు

కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు డా. బాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం గతేడాది కామారెడ్డి జిల్లాలో 22 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్ట మొదటి సంస్థగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కించుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డా.బాలు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 7, 2025
ఖమ్మం: ‘పంచాయతీ’ పోరు ఉద్ధృతం!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1042 పంచాయతీల్లో మూడు విడతల (డిసెంబర్ 11, 14, 17) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గుర్తులు కేటాయించిన తొలి, రెండో విడత అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాత్రి వేళల్లో ఆర్థిక హామీలతో మంతనాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, తమ ఎమ్మెల్యేలు, కీలక నేతలను రంగంలోకి దించడంతో పల్లెపోరు మరింత వేడెక్కింది.
News December 7, 2025
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
News December 7, 2025
నేడు కడప జిల్లాకు తెలంగాణ డిప్యూటీ CM.!

తెలంగాణ డిప్యూటీ CM బట్టి విక్రమార్కతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పోట్లదుర్తికి రానున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నాయుడు ఇటీవలే మాతృవియోగం అవడంతో ఆయనను పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి వారు పొట్లదుర్తి చెరుకుని అనంతరం అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.


