News March 24, 2025
KMR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వరల్డ్ టీబీ డే

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో టీబీ సిబ్బంది ప్రపంచ వరల్డ్ టీబీ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్వో డా.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. టీబీ రహిత కామారెడ్డి జిల్లాగా మార్చడానికి సిబ్బంది నిరంతరం కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న టీబీ సిబ్బందిని జ్ఞాపికలతో అభినందించారు. PO ప్రభు కిరణ్, DPPM శోభ ఉన్నారు.
Similar News
News November 28, 2025
వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోశ్..!

మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న జక్కుల సంతోశ్ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన సంతోశ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కావాలంటూ నర్సయ్యను పిలిపించి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
News November 28, 2025
బాపట్ల: పరీక్షల షెడ్యూల్ రద్దు..!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షల షెడ్యూల్ను రద్దు చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
News November 28, 2025
జనగామ: నీకు నేను.. నాకు నువ్వు..!

కోతులు ఇబ్బంది పెడుతున్నాయంటూ జనగామ జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మనం ఇబ్బంది పడినట్లుగానే కోతులు కూడా అవస్థలు పడుతున్నాయి. రోజంతా ఆహార సేకరణ కోసం తిరిగి అలిసిపోయిన వానరాలు.. జనగామలోని రైల్వే స్టేషన్కి చేరాయి. గోడ పైన సేద తీరుతూ, చలికి వణుకుతూ ‘నీకు నువ్వు.. నాకు నేను’ అన్నట్లుగా ఒక దానికి ఒకటి హత్తుకొని కూర్చున్నాయిలా..


