News April 5, 2025
KMR: జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు

యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 33 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమై 686 టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 6, 2025
విశాఖ: క్రికెట్ ఫ్యాన్స్కు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలివే

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ పోలీసులు పార్కింగ్ మార్గదర్శకాలు విడుదల చేశారు. వీఐపీలు NH-16 ద్వారా నేరుగా స్టేడియానికి చేరుకోవాలి. నగరం నుంచి వచ్చే వారు సాంకేతిక కాలేజీ వద్ద, శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్, మిధిలాపురి వద్ద పార్క్ చేయాలి. బీచ్ రోడ్ నుంచి వచ్చే వారికి MVV సిటీ, ఆర్టీసీ బస్సులకు లా కాలేజీ వద్ద స్థలం కేటాయించారు.
News December 6, 2025
సింహాచలం: కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య

సింహాచలం కొండ కింద దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆధార్ కార్డు ప్రకారం గాజువాకకు చెందిన నీలావతి, అయ్యప్పంజన్గా గుర్తించారు. ఇద్దరూ దేవస్థానం కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం రూమ్ తీసుకున్నారు. రూములో ఉరివేసుకోవడంతో దేవస్థానం సిబ్బంది గమనించి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఘటనా స్థలికి చేరుకొని మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు.
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్పోర్టు కోరింది.


