News April 3, 2025
KMR: జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం

కామారెడ్డి జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇసుక తవ్వకాలు, రవాణా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చూస్తాం అని అన్నారు.
Similar News
News October 15, 2025
చెక్ లిస్టులు సరి చూసుకోవాలి: డీఐఈఓ

జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ప్రథమ, ద్వితీయ సం. విద్యార్థులు తమ వివరాలను సరి చూసుకునే సౌకర్యం కల్పించారని, విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింకు ద్వారా నేరుగా తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు.
News October 15, 2025
డేటా సెంటర్‌కు నీరెందుకు అవసరం?

డేటా సెంటర్లలోని వేలాది సర్వర్లు, స్టోరేజీ డివైజులు, నెట్‌వర్కింగ్ పరికరాలు 24/7 రన్ అవుతాయి. దీంతో అధిక టెంపరేచర్ జనరేట్ అవుతుంది. వాటిని <<18016110>>కూల్<<>> చేయకపోతే హార్డ్‌వేర్ ఫెయిల్ కావడంతో పాటు అగ్నిప్రమాదాలూ జరగొచ్చు. ఒక పెద్ద డేటా సెంటర్ మెగావాట్ల విద్యుత్, రోజుకు లక్ష నుంచి 5 లక్షల గ్యాలన్ల నీటిని వాడుకుంటుంది. చిల్లర్స్, లిక్విడ్ కూలింగ్, నీటి ఆవిరి, కూలింగ్ టవర్లు ఉపయోగించి వాటిని కూల్ చేస్తారు.
News October 15, 2025
వనపర్తి: బీసీ రిజర్వేషన్లకు BRS, BJP మోకాళ్లు అడ్డు: సీపీఐ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు రాష్ట్ర బీసీ హక్కుల సాధక సమితి పిలుపునిచ్చింది. వారికి మద్దతుగా బుధవారం వనపర్తిలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ.. BRS, BJPలు బీసీ రిజర్వేషన్‌ని అడ్డుకుంటున్నాయని, చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లుకు గవర్నర్ రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించాలన్నారు. నేతలు కళావతమ్మ, గోపాలకృష్ణ ఉన్నారు.