News March 5, 2025
KMR: టీ ప్రైడ్ కింద 12 మందికి రాయితీ: కలెక్టర్

తెలంగాణ టీ ప్రైడ్, టీ పాస్ పెట్టుబడి రాయితీలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు టీజీ ఐ- పాస్ కింద 1370 దరఖాస్తులు రాగా, పరిశీలించి 1327 దరఖాస్తులను ఆయా శాఖల ద్వారా పరిశీలించి 1128 దరఖాస్తులు పరిశీలించి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ బుధవారం తెలిపారు.
Similar News
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 10, 2025
దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే టిడ్కో ఇళ్లు: కలెక్టర్

జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు టిడ్కో ఇళ్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే మంజూరయ్యేలా చూస్తామని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఎవరికీ మంజూరు చేయని ఇళ్లలో వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడిన ఆమె.. క్రీడల్లో రాణించిన వారికి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.


