News March 30, 2024
KMR: డాన్స్ చేయెుద్దన్న భార్య.. సూసైడ్ చేసుకున్న భర్త

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. భార్య డాన్స్ చేయెుద్దన్నందుకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వివరాల ప్రకారం.. చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బారాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయెుద్దని భార్య..భర్త అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 20, 2025
నేషనల్ ఫుట్‌బాల్ టోర్నీకి నిజామాబాద్ జిల్లా క్రీడాకారుణులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి NZB జిల్లా క్రీడాకారుణులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్, పూర్విక U-14 విభాగంలో, జాహ్నవి యాదవ్, సాయి సమీక్ష U-17 విభాగంలో ఎంపికయ్యారు. U-14 విభాగంలో ఎంపికైన వారు కాశ్మీర్లో, U-17 విభాగంలో ఎంపికైన వారు కేరళలో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.

News December 19, 2025
NZB: ప్రజల సహకారంతోనే జీపీ ఎన్నికలు ప్రశాంతం: సీపీ

ప్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే GP ఎన్నికలు నజావుగా నిర్వహించామని సీపీ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుంచి Dec 17 వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేని కృషి చేశారన్నారు.