News March 30, 2024
KMR: డాన్స్ చేయెుద్దన్న భార్య.. సూసైడ్ చేసుకున్న భర్త

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. భార్య డాన్స్ చేయెుద్దన్నందుకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వివరాల ప్రకారం.. చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బారాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయెుద్దని భార్య..భర్త అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 18, 2026
NZB: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాల పరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో సభ్యులుగా జి.సాయి ప్రసాద్, బాల కుమార్, నర్సింహులు, భూపతి, రామదయానంద్, మహ్మద్ గౌస్, శ్రీనివాస్, శ్రీకాంత్, మాజిద్, జాన్సన్‌లను నియమించారు.
News April 17, 2026
TU: వార్షికోత్సవ పనులను వేగవంతం చేయాలి: వీసీ

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.
News April 17, 2026
LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.


