News January 24, 2025

KMR: డేటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభల్లో విచారణ చేపట్టిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి డేటాను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. శుక్రవారంతో సభలు ముగియనుండడంతో డేటా ఎంట్రీని త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలు తలెత్తకుండా సభలు నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.

Similar News

News December 9, 2025

తెలంగాణలో సల్మాన్ ఖాన్ వెంచర్స్

image

సల్మాన్ ఖాన్ వెంచర్స్ తెలంగాణలో రూ.10,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనుంది. తెలంగాణ రైజింగ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రకటనలలో ఇది ఒకటి. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఆవిష్కరించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ లగ్జరీ హాస్పిటాలిటీ, అనుభవపూర్వక విశ్రాంతి, క్రీడా మౌలిక సదుపాయాలు, పూర్తి స్థాయి ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థను మిళితం చేస్తుంది.

News December 9, 2025

GNT: అధికార పార్టీ ఎమ్మెల్యే.. అసంతృప్తి స్వరం..!

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ నిత్యం అధికారులపై ఏదో ఒక రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రోటోకాల్ దక్కలేదని ఒకసారి, రేషన్ డీలర్లపై మరోసారి కలెక్టర్‌కి గతంలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె కార్యాలయం ముందు గుంతలు పడిన రహదారిని పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గం ఇటు ప్రజల్లో, అటు SMలో హాట్ టాపిక్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News December 9, 2025

ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: డైరెక్టర్ మారుతి

image

‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారంలో హీరో ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న అక్కడ భారీ <<18509568>>భూకంపం<<>> సంభవించడంతో డార్లింగ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘నేను ప్రభాస్‌తో మాట్లాడాను. ఆయన సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.