News December 7, 2024
KMR: ‘తప్పులు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి’
ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చివరి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ప్రతినిధులలో వారం సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా సవరణలపై చర్చించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ నివాళులు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ఆయన మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ సతీమణిని పరామర్శించారు.
News December 27, 2024
కామారెడ్డి: UPDATE.. అనుమానంతో భార్య హత్య
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అవుసులతండాలో మహిళను ఆమె <<14980915>>భర్త కత్తితో నరికి చంపిన<<>> విషయం తెలిసిందే. కాగా హత్యకు సంబంధించి వివరాలను ఎస్ఐ శివకుమార్ వెల్లడించారు. అవుసులతండాకు చెందిన మెగావత్ మోతిబాయి(55) పై ఆమె భర్త షేర్య కొంత కాలంగా అనుమానం పెంచుకున్నాడు. కాగా బుధవారం ఆగ్రహంతో భార్య మోతిబాయిని హత్య చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: టీపీసీసీ చీఫ్
మాజీ PM మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి, పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి, అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.