News February 1, 2025
KMR: తెలంగాణను మరోసారి విస్మరించారు: షబ్బీర్ అలీ

కేంద్ర బడ్జెట్లో తెలంగాణను మరోసారి విస్మరించారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖల సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ ఊసు ఎత్తకపోవడం శోచనీయమన్నారు. దేశంలో మైనార్టీలు, దళితులు, మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని బడ్జెట్లో మహిళల భద్రత పై ఉసెత్తలేదని మండిపడ్డారు.
Similar News
News February 20, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా నేర వార్తల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని నేరా వార్తల వివరాలు.. సిరిసిల్లలో 22 గంజాయి కేసులు:ఎస్పీ అఖిల్ మహాజన్ @కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు: సీఐ కృష్ణ@ఎల్లారెడ్డిపేట మండలంలో గుడి మెట్ల ధ్వంసం ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు:ఎస్సై రమాకాంత్@ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తి వీరంగం@సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..కేసు నమోదు:ఎస్సై శ్రీకాంత్ గౌడ్ @ముస్తాబాద్ మండలంలో పిడిఎస్ రైస్ పట్టివేత:ఎస్సై గణేష్
News February 20, 2025
ఫాస్టాగ్ 70 నిమిషాల రూల్‌పై NHAI క్లారిటీ

టోలోప్లాజాకు చేరుకునే ముందు 60 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. FEB 17 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై NHAI క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంక్ మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి NPCI ఈ సర్క్యూలర్ జారీ చేసిందని వెల్లడించింది.
News February 20, 2025
BREAKING: జగన్‌పై కేసు నమోదు

AP: మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా 8 మందిపై కేసు పెట్టారు.