News January 24, 2025

KMR: దివ్యాంగులకు రుణాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల గురువారం తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 % రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News October 15, 2025

గుంటూరు: ఆటో డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష

image

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ కోటి వెంకట రెడ్డికి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంగళవారం 3 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు సాక్ష్యాలను సమర్పించడంతో నిందితుడు దోషిగా తేలాడు. విచారణలో ఎస్ఐ అమీర్, ఏపీపీ శౌరి కృషి చేశారు. ఎస్పీ పోలీసులను అభినందించారు.

News October 15, 2025

కోదాడలో అరుదైన శస్త్రచికిత్స.. దూడకు చేప చర్మం

image

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశువైద్యుడు డా.పెంటయ్య జిల్లాలోనే తొలిసారిగా అరుదైన గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్స చేశారు. ఆటో ఢీకొని కాలికి తీవ్ర గాయమై చర్మం ఊడిపోయిన ఒక గేదె దూడకు ఆయన చేప చర్మాన్ని ఉపయోగించి గ్రాఫ్టింగ్ చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రైతు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ పెంటయ్య చేసిన ఈ అరుదైన వైద్యంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News October 15, 2025

శ్రీశైలం రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు

image

ప్రధాని <<18008909>>మోదీ<<>> పర్యటన నేపథ్యంలో రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాద్-శ్రీశైలం, దోర్నాల-శ్రీశైలం మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ప్రధాని పర్యటన అనంతరం రాకపోకలు మళ్లీ ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.