News January 24, 2025
KMR: దివ్యాంగులకు రుణాలు.. దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి ప్రమీల గురువారం తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 % రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News October 25, 2025
రాయదుర్గం: ఇన్స్టాగ్రాం పిచ్చి.. మృత్యువుకు దారి తీసింది

BTP డ్యాం స్పిల్ వే గేటు వద్ద గల్లంతైన యువకుడి వివరాలు లభ్యమయ్యాయి. రాయదుర్గంలోని కలేగార్ వీధికి చెందిన ముగ్గురు యువకులు డ్యాం గేట్లు ఓపెన్ చేస్తుండటంతో ఇన్స్టాగ్రాం వీడియోల కోసం వెళ్లారు. అందులో ఇద్దరు నీటిలో ఈత కొడుతూ.. గల్లంతయ్యారు. వారిలో ఒకరు బయటకురాగా మరో యువకుడు మహమ్మద్ ఫైజ్ ఆచూకీ లభించలేదు. చివరకు మత్స్యకారులు మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విలపించారు.
News October 25, 2025
హెన్నాతో జుట్టుకు ఎన్నో లాభాలు

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.
News October 25, 2025
రేపటి నుంచి 3 రోజులు బీచ్కి రావొద్దు: ఎస్సై

తుపాన్ హెచ్చరికల జారీ, సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిన కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు పేరుపాలెం బీచ్లోకి సందర్శకులకు అనుమతి లేదని మొగల్తూరు ఎస్సై వాసు శనివారం తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.


