News October 30, 2024
KMR: నవంబర్ 28లోగా అభ్యంతరాలు, ఆక్షేపణలు తెలపండి: ఆశిష్ సాంగ్వాన్

స్పెషల్ సమ్మరీ రివిజన్- 2025 కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం ప్రకటించడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే నవంబరు 28 లోగా సమర్పించవచ్చన్నారు. నవంబరు 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ 24న పరిష్కరించడం పూర్తవుతుందన్నారు. జనవరి 26న ఫైనల్ పబ్లికేషన్ ప్రకటిస్తామని తెలిపారు.
Similar News
News December 18, 2025
NZB: ఫుడ్ పాయిజన్తో విద్యార్థిని మృతి

మెండోరా(M) పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ముప్కాల్కు చెందిన సాయి లిఖిత HYD చికిత్స పొందుతూ మరణించింది. ఈ నెల 5న బాలిక వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని, ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలఎదుట మృతదేహంతో నిరసనకు యత్నించారు.
News December 18, 2025
నిజామాబాద్: మూడో స్థానంలో స్వతంత్రులు

నిజామాబాద్ జిల్లాలో జరిగిన లోకల్ దంగల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. జిల్లాలో మూడు విడతల్లో 545 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలతో కలుపుకొని 362 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొంది మొదటి స్థానంలో నిలవగా, 76 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. 60 మంది స్వతంత్రులు గెలిచి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 47 గ్రామాల్లో బీజేపీ చివరగా ఉంది.
News December 18, 2025
NZB: మూడు దశల్లో మహిళలే ఎక్కువ

నిజామాబాద్ జిల్లాలో మూడు దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వేశారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లో 7,88,356 మంది ఓటర్లు ఉండగా 6,15,257 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,49,574 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 2,65,679 మంది, ఇతరులు నలుగురు ఓటేశారు.


