News January 18, 2025

KMR: నవోదయ ప్రవేశ పరీక్షకు 2076 మంది గైర్హాజరు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్ష పూర్తైనట్లు నిజాంసాగర్ నవోదయ పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మను యోహనన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో14, కామారెడ్డి జిల్లాలో 14 కేంద్రాల్లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం 6,040 మంది దరఖాస్తు చేసుకోగా 3,964 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా 2076 మంది గైర్హాజరైనట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ వెల్లడించారు.

Similar News

News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 16, 2025

సిద్దిపేట: నేడు కొమురవెల్లి మల్లన్న ఐదో వారం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో ఆదివారం (నేడు) ఉత్సవాలకు సుమారు 50 వేల మంది భక్తులు తరలి రానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు మల్లన్నకు బోనాలు సమర్పిస్తారు. మండపం వద్ద గంగిరేగు చెట్టు ఆవరణ, బసచేసే గదుల వద్ద పట్నాలు వేయనున్నారు. మల్లన్న గుట్టపైన ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు.

News February 16, 2025

సంతమాగులూరు: పునాదులు తీస్తుండగా బయటపడ్డ విగ్రహం

image

సంతమాగులూరులో మాజీ సర్పంచ్ జమ్ముల నాగరాజు కుటుంబీకులు శనివారం నూతన ఇల్లు నిర్మించుకునేందుకు ఇంటి పునాదులు తీస్తుండగా పురాతన పోతురాజు విగ్రహం బయటపడింది. విగ్రహాన్ని గమనించిన జమ్ముల కుటుంబీకులు పరిసర నివాసాల వారు విగ్రహాన్ని కడిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ విగ్రహాన్ని వేద పండితుల సలహా మేరకు స్థానిక శివాలయంలో భద్రపరిచారు.

error: Content is protected !!