News April 16, 2025

KMR: నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరా: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో నీటి సరఫరాకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Similar News

News December 7, 2025

స్మృతితో పెళ్లి రద్దు.. పలాశ్ ఏమన్నారంటే?

image

స్మృతి మంధానతో పెళ్లి రద్దుపై పలాశ్ ముచ్చల్‌ SMలో పోస్ట్ పెట్టారు. ‘పర్సనల్ రిలేషన్‌షిప్ నుంచి తప్పుకుంటున్నా. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. నాపై వచ్చిన నిరాధారమైన వదంతులు బాధించాయి. గాసిప్‌ల ఆధారంగా ఎవరినీ జడ్జ్ చేయవద్దనే విషయాన్ని సమాజం నేర్చుకోవాలి. నాపై తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News December 7, 2025

అనంతపురంలో అన్నదమ్ములు మృతి..!

image

ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు నరేంద్ర(32), చరణ్(25) మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బ్రహ్మసముద్రం మండలానికి చెందిన చరణ్ కాలు జారి నీటికుంటలో పడ్డాడు. అన్న నరేంద్ర అతణ్ని కాపాడేందుకు నీటి కుంటలోకి దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News December 7, 2025

ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

image

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.