News January 31, 2025
KMR: నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్

రాబోయే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తాగునీటి వేసవి ప్రణాళిక పై గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నుంచి మండల ప్రత్యేక అధికారులు మండల కేంద్రాలను సందర్శించి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి నీటి సరఫరా పరిస్థితిని అంచనా వేయాలన్నారు.
Similar News
News March 14, 2025
ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతి

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మణికుమార్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగిగా గుర్తించామన్నారు. కుటుంబ కలహాలతో వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కాలువలో దూకి మృతిచెందాడని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News March 14, 2025
VKB: ఎండిపోతున్న పెద్ద చెరువు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. చెరువు ఆయకట్టు కింద సుమారు 90 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువు ఎండిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండ్లు పడటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. చెరువు నీరు వృథా పోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
News March 14, 2025
కామారెడ్డి: అక్కడ హోలీ పండగొస్తే గుండు ఎత్తాలి..!

హోలీ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. కాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామంలో హోలీ పండుగను విభిన్నంగా నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రజలంతా ఒక చోట చేరి పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు నిర్వహిస్తారు. అనంతరం ఆనవాయితీగా వస్తున్న బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. ఈసారి 95 కేజీల గుండును ఎత్తాలని పోటీ పెట్టగా యువకులు పాల్గొన్నారు.