News January 31, 2025
KMR: నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్

రాబోయే వేసవి కాలంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తాగునీటి వేసవి ప్రణాళిక పై గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నుంచి మండల ప్రత్యేక అధికారులు మండల కేంద్రాలను సందర్శించి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి నీటి సరఫరా పరిస్థితిని అంచనా వేయాలన్నారు.
Similar News
News February 7, 2025
కడప: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజామున ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహించారు. రహదారులపై వెళ్తున్న లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు డ్రైవర్లకు ఆపి ముఖాలు కడుక్కుని వెళ్ళమని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు.
News February 7, 2025
బీసీ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు గడువు 12కు పెంపు

బీసీ కార్పొరేషన్ దరఖాస్తు గడువును 12కు పెంచినట్లు చిత్తూరు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి తెలిపారు. బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకూ పెంచిందన్నారు.
News February 7, 2025
చిత్తూరు: అంత్యక్రియల్లో అపశ్రుతి

అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బాణసంచా పేలి పలువురికి గాయాలైన ఘటన గంగవరం మండలంలో జరిగింది. దండపల్లి గ్రామానికి చెందిన మునివెంకటమ్మ(82) మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బాణసంచా పేల్చే క్రమంలో సంచిలో ఉన్న టపాకాయలకు నిప్పు అంటుకుని బాణసంచా జనంపైకి దూసుకెళ్లింది. దీంతో వెంకటరమణ, కుమార్, చిన్నబ్బ, చిన్నన్న, గురవయ్య, కుమార్ బాబుకి గాయాలు కాగా వారిని పలమనేరు, చిత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.