News January 21, 2025

KMR: నేటి నుంచి ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు

image

కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం కామారెడ్డి, దోమకొండ, పల్వంచ, బిక్కనూర్, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, బిబిపేట్ ప్రాంతాల వారికి కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్‌లోని KVS గార్డెన్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 29, 2025

FLASH: వికారాబాద్ జిల్లాలో కాలేజీలు, స్కూళ్లకు సెలవు

image

వికారాబాద్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉత్తర్వులను జారీ చేశారు.

News October 29, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు!

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 29, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని బాలికను 2019 ఏప్రిల్‌లో అత్యాచారం చేసిన కేసులో నేరం నిర్ధారణ కావడంతో కళ్యాణ్ అనే నిందితుడికి జడ్జి శంకర్రావు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు.