News January 27, 2025

KMR: నేడే అకౌంట్‌లో రైతు భరోసా నగదు జమ

image

కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రైతు భరోసాతో పాటు మరో మూడు పథకాలను గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ కానుంది. అయితే జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 9,062 మంది రైతులకు సంబంధించి 13,934.17 ఎకరాలకు గానూ రూ.83,522,820 నగదు జమ కానుంది. ఈ నివేదికను కలెక్టరేట్ కార్యాలయం ఆదివారం విడుదల చేసింది.

Similar News

News December 5, 2025

గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ‘సండే ఈవినింగ్‌ టాక్‌’

image

బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌ క్యాంపస్‌లో ఆదివారం ‘సండే ఈవినింగ్‌ టాక్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్‌మెంట్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

News December 5, 2025

మూడో విడత.. నిన్న ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 7 మండలాల్లో కలిపి సర్పంచ్‌కు 288, అటు వార్డులకు 1173 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో కలిపి ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు గాను 378, 1742 వార్డులకు గాను 1410 నామినేషన్లు వచ్చాయి.

News December 5, 2025

ADB: పల్లె నుంచి పార్లమెంటు వరకు..!

image

ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో సర్పంచ్ కీలక పదవి. అలా గ్రామంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారు కొందరు మంత్రులయ్యారు. ఆ కోవకు చెందినవారే పొద్దుటూరి నర్సారెడ్డి. సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామ సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం మూడుసార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందులో ఓసారి ఏకగ్రీవ ఎమ్మెల్యేగా కావడం విశేషం. నర్సారెడ్డిని స్థానికులు నరసన్న బాపు అని ప్రేమగా పిలిచేవారు.