News February 20, 2025
KMR: నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు: SP

నేరం చేసిన నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. బీబీపేట్ PS పరిధిలో అత్యాచారం కేసులో నేరస్థుడిగా నిరూపితమై 7ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించిందన్నారు. నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
‘Mr.COOL’ వ్యాపార సామ్రాజ్యం @ ₹1000 కోట్లు

ధోనీలో క్రికెటే కాదు ఎవరూ గుర్తించని వ్యాపార కోణమూ ఉంది. కూల్‌గా ఫోకస్డ్గా ఆడుతూ ట్రోఫీలు సాధించినట్లే.. సైలెంట్‌గా ₹1000CR వ్యాపార సామ్రాజ్యాన్నీ స్థాపించారు. చెన్నైతో ఉన్న అనుబంధం అతని వ్యాపార దృక్పథాన్ని మార్చేసింది. చెన్నై ఫుట్‌బాల్ క్లబ్ కో ఓనర్ మొదలు కార్స్24, ఖాతాబుక్, EMotorad ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్స్, Tagda Raho, సెవెన్ ఇన్ లైఫ్ స్టైల్ ఇలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు.
News December 8, 2025
జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
News December 8, 2025
అఖండ-2 రిలీజ్ ఎప్పుడు?

అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాలకృష్ణ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. DEC 12న ఎట్టిపరిస్థితుల్లోనూ మూవీ విడుదల చేయాల్సిందేనని SMలో డిమాండ్ చేస్తున్నారు. #WeWantAkhanda2OnDec12th హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కొందరైతే నిర్మాతలకు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ శుక్రవారమే రిలీజ్ ఉండే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.


