News February 20, 2025
KMR: నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు: SP

నేరం చేసిన నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. బీబీపేట్ PS పరిధిలో అత్యాచారం కేసులో నేరస్థుడిగా నిరూపితమై 7ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించిందన్నారు. నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
తొర్రూర్‌లో బాలికకు అబార్షన్!

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
News March 22, 2025
ఎమ్మెల్సీ దువ్వాడకు డాక్టరేట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు “DAYSPRING INTERNATIONAL UNIVERSITY” డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ మేరకు తాజాగా శుక్రవారం హైదరాబాద్ యూనివర్సిటీలో తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.
News March 22, 2025
రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.