News January 21, 2025
KMR: నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: SP

నేరాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన ఒక కేసులో సోమవారం ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరిచామన్నారు. ఒకరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష , రూ.4 వేల జరిమానా, మరొకరికి ఏడాది జైలు శిక్ష రూ.4 వేల జరిమానా విధిస్తూ.. జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు విధించినట్లు ఆమె తెలిపారు.
Similar News
News February 24, 2026
యాభై ఏళ్ల ప్రస్థానం.. ముగిసినట్లేనా?

ADB, KNR జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి తగ్గింది. అగ్రనేత దేవ్ జీ లొంగుబాటు వార్తలతో KNR జిల్లాలో ముప్పాల లక్ష్మణరావుతోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడే మిగిలినట్లు తెలుస్తోంది. 2000 నుంచి 2026, ఫిబ్రవరి 21 వరకు మావోయిస్టుల పోరులో మొత్తం 12,170 మంది మృతి చెందారు. వీరిలో 5,057 మంది మావోయిస్టులు, 2,007 మంది భద్రతా సిబ్బంది, 4,138 మంది పౌరులున్నారు. మూడేళ్లలో 793 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమయ్యారు.
News February 24, 2026
భూపాలపల్లి జిల్లాలో 8.4 మి.మీల వర్షపాతం నమోదు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 8.4 మి.మీల వర్షపాతం నమోదైంది. టేకుమట్ల మండలంలో అత్యధికంగా 6.2 మి.మీలు, రేగొండ మండలంలో 2.2 మి.మీల వర్షం కురిసింది. మహాదేవ్‌పూర్, పలిమెల, కాటారం, రేగొండ తదితర మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీలుగా నమోదైనట్లు సీపీఓ కార్యాలయం వెల్లడించింది.
News February 24, 2026
నల్గొండ: అన్నదాతకు ‘స్మార్ట్’ ఫోన్ కష్టాలు

యూరియా పంపిణీకి ప్రభుత్వం తెచ్చిన ఆన్లైన్ యాప్ ఉమ్మడి NLG రైతుల పాలిట శాపంగా మారింది. స్మార్ట్ఫోన్లు లేక, ఓటీపీలు రాక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసేలోపే స్టాక్ నిండుకోవడం, యాప్‌లో చూపించినా డీలర్ల వద్ద బస్తాలు ఉండకపోవడంతో నిరాశ చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. విసిగిపోయిన రైతులు.. యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో ఎరువులు అందజేయాలని రోడ్డెక్కుతున్నారు.


