News March 29, 2025

KMR: పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి: సీఈఓ

image

రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి చట్టాల అమలు, శాంతి భద్రతలు, ఓటరు జాబితా సవరణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

image

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.

News December 1, 2025

అనంతపురంలో రోడ్డెక్కిన అరటి రైతులు

image

అనంతపురం కలెక్టరేట్ వద్ద అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అరటి రైతులు రోడ్డెక్కి ఆర్తనాదాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అరటి రైతులను ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని శైలజానాథ్ హెచ్చరించారు.

News December 1, 2025

తిరుపతి జిల్లా ప్రైవేట్ స్కూల్లో భారీ మోసం

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే నామినల్ రోల్స్ ప్రక్రియ కొనసాగుతుండగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. జిల్లాలో 271 ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. 12,796 మంది పది పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 వసూలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ చాలా స్కూల్లో రూ.1000 తీసుకుంటున్నారు. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎంత కట్టారో కామెంట్ చేయండి.