News March 13, 2025

KMR: పక్వానికి రాని పంటను కొయొద్దు: DAO

image

కామారెడ్డి జిల్లాలో వరి కోతల సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లతో సమావేశం IDOCలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడారు. హార్వెస్టర్‌లు పక్వానికి రాని పంటను కొయొద్దని సూచించారు. నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో కోతకు రాని పంటను కోస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News November 18, 2025

VKB: పాఠశాలల్లో బాలల సభలు నిర్వహించాలి: కలెక్టర్

image

మండలంలోని పాఠశాలల్లో బాలల కోసం బాలసభలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ డీపీఆర్సీ భవనంలో బాలసభల నిర్వహణకు పంచాయతీ సెక్రెటరీలు, మండల పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 20న బాలల సభలు నిర్వహించాలన్నారు. బాలల సభల ద్వారా విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన చేయాలన్నారు.

News November 18, 2025

గురువారం గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

image

గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ (ఫిర్యాదుల స్వీకరణ), ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున, జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావచ్చని కలెక్టర్ కోరారు.

News November 18, 2025

రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.