News March 13, 2025

KMR: పక్వానికి రాని పంటను కొయొద్దు: DAO

image

కామారెడ్డి జిల్లాలో వరి కోతల సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హార్వెస్టర్ యజమానులు, డ్రైవర్లతో సమావేశం IDOCలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడారు. హార్వెస్టర్‌లు పక్వానికి రాని పంటను కొయొద్దని సూచించారు. నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో కోతకు రాని పంటను కోస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News February 9, 2026

BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.

News February 9, 2026

KNR: ఎన్నికల నిఘా ‘ముమ్మరం’.. సరిహద్దుల్లో తనిఖీలు!

image

ప్రలోభాలను అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ​ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ​జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీని కఠినతరం చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 28 వరకు జిల్లాలోపోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు.

News February 9, 2026

బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

image

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్‌లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.