News February 28, 2025
KMR: పట్టభద్రులు 78.12 శాతం, ఉపాధ్యాయులు 93.63 శాతం

కరీంనగర్, ఆదిలాబాద్, NZB, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల MLC స్థానాలకు జరిగిన ఎన్నికలు కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో పట్టభద్రులు 16,410 ఉండగా, 12820 మంది ఓటును వేశారు. దీంతో జిల్లాలో గ్రాడ్యుయేట్ పోలింగ్ 78.12శాతం నమోదైంది. అటు జిల్లాలో 2011 మంది టీచర్లకు ఓటు హక్కు ఉండగా 1883 మంది తమ ఓటును వేశారు. టీచర్లు 93.63% ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.
Similar News
News September 18, 2025
GDK: ‘నిజాం రాచరికాన్ని ఓడించింది కమ్యూనిస్టులే’

నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య అన్నారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు- వక్రీకరణలు’ అనే అంశంపై గురువారం సదస్సు జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు BJPకి లేదన్నారు. ఎర్రవెల్లి ముత్యం రావు, మెండె శ్రీనివాస్, మహేశ్వరి, కుమారస్వామి, బిక్షపతి, శ్రీనివాస్, రాజమౌళి ఉన్నారు.
News September 18, 2025
NZB: పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి: CP

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని నిజామాబాద్ CP సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహణ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News September 18, 2025
VZM: ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక

జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. లాటరీ ప్రక్రియలో జిల్లాలో నాలుగు బార్లకు ఎంపిక జరిగిందన్నారు.