News March 28, 2025

KMR: పదో తరగతి పరీక్షలు.. గైర్హాజరు ఎంతంటే..?

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 28, 2026

ఆదిలాబాద్: ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

image

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్‌ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News February 28, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 28, 2026

ముంబైలో కెనడా ప్రధాని: టార్గెట్ $50 బిలియన్లు

image

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా ముంబై చేరుకున్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ అని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్, ఎనర్జీ, AI రంగాల్లో పార్ట్‌నర్‌షిప్‌ను పెంచుకోవడమే ఈ పర్యటన లక్ష్యం. 2030 నాటికి $50 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ భావిస్తోంది. మార్చి 2న ప్రధాన మంత్రి మోదీతో కార్నీ భేటీ కానున్నారు.